పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ఆయన సుజిత్ డైరెక్షన్‌లో ‘ఓజి’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా మేకర్స్ రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లాయి.
అయితే, ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్ర సహ నిర్మాత కళ్యాణ్ దాసరి తాజాగా పవన్ కళ్యాణ్‌తో కలిసి ఓ ఫోటో దిగారు. ఇక ఈ ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఓజి షూటింగ్ ముగిసిందని.. ఇక ఈ చిత్రం విధ్వంసం సృష్టించడం మొదలుపెడుతుంది.. అంటూ ఆయన కామెంట్ చేశారు.
దీంతో ఓజి చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల్లో ఈ సినిమాపై మరింత ఆసక్తి క్రియేట్ అయింది. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.