అక్కినేని వారి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని అఖిల్ ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఏజెంట్ లాంటి ప్లాప్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని చేస్తున్న భారీ చిత్రమే “లెనిన్”. దర్శకుడు కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ మాస్ చిత్రం పట్ల మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా యంగ్ సెన్సేషన్ శ్రీలీల నటించిన సంగతి తెలిసిందే.
కానీ ఆమె తప్పుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇక దీనిపై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. శ్రీలీలని రీప్లేస్ చేసిన భాగ్య శ్రీ బోర్సే ఈ జూలై 16 నుంచి షూటింగ్ సెట్స్ లో అడుగు పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. సో శ్రీలీల ఇక లేదనే చెప్పొచ్చు. మరి ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ అలాగే శ్రీకార స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.