స్పెషల్: ఇండియన్ సినిమా గేమ్ ఛేంజర్ ‘బాహుబలి’కి పదేళ్లు.. ఈ విషయాలు తెలుసా?

స్పెషల్: ఇండియన్ సినిమా గేమ్ ఛేంజర్ ‘బాహుబలి’కి పదేళ్లు.. ఈ విషయాలు తెలుసా?

Published on Jul 10, 2025 9:00 AM IST

అప్పటివరకు ఇండియన్ సినిమా అంటే కేవలం హిందీ సినిమా అనుకునే ప్రేక్షకులు అందరినీ ఒక్కసారిగా తెలుగు సినిమా పవర్ అంటే ఏంటో చూపించిన చిత్రమే “బాహుబలి 1”. అప్పటివరకు వచ్చిన సినిమాలు అన్నీ ఒకెత్తు బాహుబలి ఒకెత్తు అనేలా ఈ సినిమా నిరూపించింది. అప్పటికి తెలుగు సినిమా నుంచి ఆ రేంజ్ బడ్జెట్ అనేది గగనం అప్పటికే హిందీ సహా తమిళ్ సినిమా నుంచి పలు సినిమాలు వందల కోట్ల బడ్జెట్ కి మించి వచ్చినవి కూడా ఉన్నాయి.

కానీ వాటి అన్నిటికీ సమాధానంగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో చేసిన ఈ ప్రయత్నం తెలుగు సినిమా ఖ్యాతిని పెంచడమే కాకుండా ఇప్పుడు భారతీయ సినిమాకి ఆస్కార్ ని తెచ్చేంత వరకు వెళ్ళింది అంటే బాహుబలి పునాదే కారణం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మొదట సింగిల్ పార్ట్ గానే అనుకున్న సినిమా తెరకెక్కిస్తున్న కొద్దీ నిడివి పెరుగుతూ వచ్చింది దీనితో రెండు భాగాలుగా తెరకెక్కించారు. అంతే బాహుబలి పేరిట చరిత్ర నమోదు అయ్యింది. అయితే ఈ సినిమా విషయంలో కొన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి.

ఈ సినిమాని మొదట 150 కోట్లు లోపు బడ్జెట్ తోనే సింగిల్ పార్ట్ గానే అనుకున్నారు కానీ అది 250 కోట్లకి మేరకి పెరిగి రెండు భాగాలుగా మారింది. అలాగే సినిమా బడ్జెట్ విషయంలో కూడా మేకర్స్ ముఖ్యంగా దర్శకుడు రాజమౌళి చాలా పర్టిక్యులర్ గా చేశారు.

ఎంతలా అంటే ఒక టైం లో షూటింగ్ కోసం యూనిట్ అంతా పక్క స్టేట్ కి వెళ్లాల్సిన సమయంలో కేవలం ముఖ్య నటీనటులకు స్టార్ హోటల్స్ లో బస ఏర్పాటు చేసి కొన్ని సార్లు జక్కన్న అలాంటి హోటల్స్ తీసుకోకుండా బయటే కనీసం బాత్రూం కూడా సరిగ్గా క్లీన్ చెయ్యకుండా ఉండే హోటల్స్ లో ఉండిపోయేవారట.

ఇలా కొంతమేర అయినా తమకయ్యే ఖర్చుని సినిమాకే పెట్టొచ్చని అనుకున్నారట. అంతే కాకుండా స్టాఫ్ కి దాదాపు వెజ్ భోజనాలే సెట్స్ పెట్టేవారట. ఎవరో కేవలం 10 మందికి మాత్రం నాన్ వెజ్ ఉండేదట. అలాగే ఇలాంటి భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కి హిందీలో సరైన రిలీజ్ ఉండాలి కానీ అందుకు వారధిగా భల్లాలదేవ రానా నిలిచాడు.

హిందీలో ఓ పెద్ద తల కావాలి అనే సమయంలో రానా కరణ్ ని సంప్రదిస్తే అక్కడ నుంచి బాహుబలి హిందీలో వండర్స్ చేసింది. ఇలా ఎంతో ఖర్చు పెట్టి తీస్తే తీరా రిలీజ్ రోజున వచ్చిన టాక్ చిత్ర యూనిట్ మొత్తానికి ఒక పెద్ద షాక్. ప్రభాస్ సహా రాజమౌళి ఇతర చిత్ర యూనిట్ అంతా ఈ సినిమా టాక్ చూసి నివ్వెరపోయారట.

ఇక తమ పని అయ్యిపోయింది అని అనుకున్న సమయంలో నెమ్మదిగా పికప్ అయ్యి జనం థియేటర్స్ దగ్గర బారులు తీరుతున్నారని తెలిసాక అప్పుడు కాస్త ఊపిరి పీల్చుకున్నారట. అలాగే సినిమా సమయంలో ప్రభాస్ చాలా రిస్కీ స్టంట్స్ కూడా చేసాడు. తన భుజానికి దెబ్బ తగిలిన తర్వాతే ధీవర సాంగ్ లో రిస్కీ స్టంట్ ని ప్రభాస్ చేసి ఆశ్చర్యపరిచాడు. ఇలా ఫైనల్ గా బాహుబలి రెండు భాగాలుగా వచ్చి ఇండియన్ సినిమా గతినే మార్చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు