ఇపుడు ఒక్క ఇండియన్ సినిమా మాత్రమే కాకుండా పాన్ వరల్డ్ లెవెల్లో స్టాంప్ వెయ్యగలిగే వన్ అండ్ ఓన్లీ సినిమా ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ అనే చెప్పవచ్చు. మరి మహేష్ బాబు అభిమానులు ఎన్నో ఏళ్ళు నుంచి చూస్తున్న కలయిక ఇది.
ఇక అందుకు తగ్గట్టుగానే మేకర్స్ భారీ వ్యయంతో సెట్టింగ్స్ చేసి అత్యున్నత ప్రమాణాలతో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా గ్లింప్స్ వస్తే డెఫినెట్ గా పాన్ వరల్డ్ లెవెల్లో అది షేక్ చేస్తుంది. మహేష్ కి రాజమౌళి బ్రాండ్ తోడు కావడంతో వీరి కలయిక ఇంటర్నేషనల్ లెవెల్ బజ్ ని తెచ్చుకుంది.
ఇలా ఈ సినిమా తాలూకా గ్లింప్స్ పై సాలిడ్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ ఆగస్ట్ 9 సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కానుకగా గ్లింప్స్ బయటకి రానుంది అన్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. ఇది కానీ నిజం అయితే మాత్రం ఖచ్చితంగా అభిమానులకి అంతకు మించిన పండగ ఇంకొకటి ఉండదని చెప్పవచ్చు. ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.