టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఇప్పుడు చేస్తున్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. తన కెరీర్ 15వ సినిమాగా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఒక ఇంట్రెస్టింగ్ హారర్ కామెడీ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. మరి తెలుగు స్టేట్స్ లో లోకల్ నుంచి విదేశాల్లో కూడా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై మేకర్స్ మరో లేటెస్ట్ అప్డేట్ అందించారు. ప్రస్తుతం ఫారిన్ షెడ్యూల్ శరవేగంగా జరుగుతుందట.
అలాగే వరుణ్ తేజ్ సహా సినిమా కీలక నటులపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మరి వరుణ్ తేజ్ పై ఓ స్టైలిష్ పోస్టర్ ని కూడా బ్లర్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వరకు ప్రామిసింగ్ కంటెంట్ తో ఎప్పటికప్పుడు అప్డేట్స్ తో వస్తున్న ఈ సినిమా టైటిల్ టీజర్ ని అతి త్వరలోనే విడుదల చేసుకోనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ వారు అలాగే యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.