ఇండియన్ సినిమా దగ్గర బాహుబలి సినిమాలతో స్కేల్ మారిపోయాక మరిన్ని భారీ చిత్రాలు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని వెతుక్కుంటూ వచ్చాయి. మరి అలా వచ్చిన చిత్రాల్లో ఎపిక్ హిస్టారికల్ చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. అయితే ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించగా ప్రభాస్ తో రామాయణం అందులోని మునుపెన్నడూ చూడని గ్రాండ్ విజువల్స్ తో అనేసరికి చాలా మంది ఎగ్జైట్ అయ్యారు.
అయితే మొదటగా వదిలిన టీజర్ మాత్రం ఊహించని రెస్పాన్స్ ని అందుకుంది. ఇక అక్కడ నుంచి ఏ గ్రాండ్ సినిమాలు అందులోని డివోషనల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన తర్వాత ఓంరౌత్ పై గట్టి కామెంట్స్ పడ్డాయి. ఇక మరో పక్క హిందీలో అనౌన్స్ చేసిన మరో రామాయణం నుంచి కొత్త కంటెంట్ ఇప్పుడు బయటకి వచ్చింది.
ఇది చూసాక మళ్ళీ ఓంరౌత్ పైనే సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆదిపురుష్ టీజర్ కంటే తక్కువే సినిమా విజువల్స్ ని చూపించి తమ వెర్షన్ రామాయణం ప్రపంచాన్ని మేకర్స్ పరిచయం చేయగా వీటితో మళ్ళీ ఓంరౌత్ పై బ్యాండ్ మొదలైంది. ప్రభాస్ ఇచ్చిన మంచి ఛాన్స్ తాను దుర్వినియోగం చేసుకున్నాడని నితీష్ తివారి విజన్ చూసి ఓం నేర్చుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.