హరిహర వీరమల్లు ట్రైలర్ ఫైనల్ కట్‌కు పవన్ ఫిదా.. ఇక బీభత్సమే!

హరిహర వీరమల్లు ట్రైలర్ ఫైనల్ కట్‌కు పవన్ ఫిదా.. ఇక బీభత్సమే!

Published on Jul 2, 2025 3:00 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని హిస్టారికల్ ఎపిక్ యాక్షన్ డ్రామాగా మేకర్స్ రూపొందించారు. ఈ చిత్రాన్ని క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్ట్ చేశారు. కాగా, ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ ఫీస్ట్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది.

హరిహర వీరమల్లు చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను జూలై 3న ఉదయం 11.10 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక ఈ ట్రైలర్‌కు సంబంధించిన ఫైనల్ కట్ కూడా రెడీ అయిందని.. ఈ ఫైనల్ కట్‌ను పవన్ తాజాగా వీక్షించాడని.. ఆయన ఈ ట్రైలర్ కట్ చూసి సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

దీంతో ఈ ట్రైలర్ ఏ రేంజ్‌లో ఇంపాక్ట్ చూపెట్టబోతుందో అర్థం అవుతుంది. ఇక ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో బీభత్సం సృష్టించడం ఖాయమని.. అది ఏ రేంజ్‌లో ఉండబోతుందా అనేది చూడాలని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, బాబీ డియోల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏ ఎం. రత్నం ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను జూలై 24న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు