అఖిల్ ‘లెనిన్’కు గ్లామర్ షాక్.. ఆ బ్యూటీని రంగంలోకి దించారా..?

అఖిల్ ‘లెనిన్’కు గ్లామర్ షాక్.. ఆ బ్యూటీని రంగంలోకి దించారా..?

Published on Jun 26, 2025 3:00 AM IST

అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ ఇప్పటికే అభిమానుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను అనౌన్స్ చేయడంతోనే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని పక్కా రూరల్ యాక్షన్ డ్రామాగా మేకర్స్ రూపొందిస్తుండటం.. ఈ చిత్రంలో అఖిల్ మాస్ లుక్‌లో కనిపించడంతో ఈ మూవీ ఖచ్చితంగా అఖిల్ కెరీర్‌లో మంచి విజయాన్ని అందుకుంటుందని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు.

ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తు్న్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ చిత్రం నుంచి శ్రీలీల వాకౌట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ‘లెనిన్’ చిత్ర యూనిట్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయితే, శ్రీలీల ఈ సినిమా నుంచి ఎందుకు వాకౌట్ చేసిందనే విషయంపై కారణాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా నుంచి ఆమె వెళ్లిపోవడంతో ఇప్పుడు ఆమె ప్లేస్‌లో మరో బ్యూటీ భాగ్యశ్రీ బొర్సెని మేకర్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

మురళీకృష్ణ అబ్బూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు