వరల్డ్ వైడ్ ‘కన్నప్ప’ భారీ రిలీజ్.. ఎన్ని వేల స్క్రీన్స్ లో అంటే!

వరల్డ్ వైడ్ ‘కన్నప్ప’ భారీ రిలీజ్.. ఎన్ని వేల స్క్రీన్స్ లో అంటే!

Published on Jun 25, 2025 10:03 AM IST

మంచు వారి డైనమిక్ హీరో మంచు విష్ణు హీరోగా ప్రముఖ దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కించిన అవైటెడ్ పాన్ ఇండియా చిత్రమే “కన్నప్ప”. పాన్ ఇండియా లెవెల్లో అనేకమంది స్టార్ హీరోలు కలయికలో తెరకెక్కించిన ఈ సినిమా ఇంకొన్ని రోజుల్లో విడుదల కాబోతుంది. మరి కన్నప్ప రిలీజ్ పై ఇప్పుడు సాలిడ్ న్యూస్ వినిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కన్నప్ప మంచు విష్ణు కెరీర్లోనే భారీ రిలీజ్ కి రాబోతుందట.

ఈ సినిమా ఏకంగా 5400 కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో 4 వేలు స్క్రీన్స్ ఒక్క ఇండియా లోనే రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఇందులోనే ఐమ్యాక్స్ వెర్షన్ ఇంకా 4డిఎక్స్ వెర్షన్ లలో ఈ సినిమా విడుదల చేస్తున్నారట. ఇక ఈ సినిమాకి స్టీఫెన్ డేవెస్సీ సంగీతం అందించగా మోహన్ బాబు నిర్మాణం వహించారు. అలాగే ఈ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు