టాలీవుడ్లో త్వరలో రాబోయే విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర క్లాసిక్ హిట్స్‌గా నిలిచాయి. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ కాంబోలో సినిమా తెరకెక్కనుండటంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతోందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే, వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాను ఆగస్టు నెలలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. దీంతో త్వరలో క్యాస్టింగ్‌ను ఫైనల్ చేసి ఈ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారు. మరి ఆగస్టులో ఈ చిత్రం పట్టాలెక్కడం ఖాయమా లేదా.. అనేది వేచి చూడాలి.