ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాలు సహా రాజకీయాలు కూడా పవన్ బ్యాలెన్స్డ్ గా నడిపిస్తున్నారు. అయితే లేటెస్ట్ గా పవన్ మాతృమూర్తి అంజనా దేవి గారి ఆరోగ్యం బాగోలేదని ఆమె క్యాబినెట్ మీటింగ్ నుంచి పవన్ మధ్యలో ఆపేసి వచ్చేసారని పలు రూమర్స్ వినిపిస్తూ వచ్చాయి. అయితే దీనిపై అసలు క్లారిటీ వినిపిస్తుంది.
దీని ప్రకారం అంజనా దేవి గారి ఆరోగ్యం క్షీణించింది అనే మాట అవాస్తవం అన్నట్టు తెలుస్తుంది. ఆరోగ్యం పరంగా ఆమె బాగానే ఉన్నారని ఎలాంటి ఇబ్బంది లేదని తెలుస్తుంది. సో ఆ వార్తల్లో నిజం లేదని చెప్పొచ్చు. ఇక పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఈ జూలై 24న గ్రాండ్ గా విడుదల కాబోతుండగా దీనికి సరిగ్గా మరొక్క నెల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది.