అక్కినేని ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్.. అవైటెడ్ ‘శివ’ రీరిలీజ్ డేట్ ఫిక్స్!?

అక్కినేని ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్.. అవైటెడ్ ‘శివ’ రీరిలీజ్ డేట్ ఫిక్స్!?

Published on Jun 13, 2025 9:00 AM IST

మన టాలీవుడ్ ఎవర్ గ్రీన్ ఛార్మింగ్ హీరో అక్కినేని నాగార్జున కెరీర్లో చేసిన పలు కల్ట్ హిట్ చిత్రాల్లో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఈ సెన్సేషనల్ హిట్ చిత్రం తెలుగు సినిమాలో ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. అయితే ఈ సినిమాని మళ్ళీ థియేటర్స్ లోకి తెచ్చేందుకు మేకర్ ఎప్పుడు నుంచో వర్క్ చేస్తున్నారు. అలా నాగార్జున మాస్ హిట్ చిత్రం “మాస్” రీరిలీజ్ థియేటర్స్ లో శివ పై రిలీజ్ చేసిన గ్లింప్స్ కి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.

మరి అక్కడ నుంచి అవైటెడ్ గా మారిన ఈ రీరిలీజ్ ఫైనల్ గా లాక్ అయ్యినట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ టాక్ ప్రకారం శివ రీరిలీజ్ ఈ ఏడాది సెప్టెంబర్ 12న చేయబోతున్నట్టుగా వినిపిస్తుంది. ప్రింట్ ని మాత్రం అదిరే లెవెల్లో రీమాస్టర్ చేస్తున్నారట. దీనితో అక్కినేని అభిమానులు మాత్రమే కాకుండా సినిమా లవర్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఇది కూడా అక్కినేని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు