గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ ‘అఖండ 2 – తాండవం’ నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను మరోసారి తనదైన రీతిలో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేలా ఈ చిత్ర టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ఈ టీజర్లో అఘోరా పాత్రలో బాలయ్య మరోసారి తన ఊచకోతను కంటిన్యూ చేస్తూ కనిపించాడు. ‘‘శివుడి అనుమతి లేనిదే యముడు ప్రాణాలు తీయడని.. అలాంటిది నువ్వు అమాయకులను చంపేస్తావా..’’ అంటూ విలన్ గ్యాంగ్‌ను బాలయ్య ఏకిపారేస్తున్న సీన్ గూస్బంప్స్ తెప్పిస్తుంది.
ఇక ‘నందమూరి’ థమన్ అందించిన బీజీఎంతో మరోసారి థియేటర్లలో స్పీకర్లు పగిలిపోవడం ఖాయమని ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఏదేమైనా బోయపాటి శ్రీను బాలయ్యతో కలిసి మరోసారి బాక్సాఫీస్ భరతం పట్టేందుకు రెడీ అయ్యాడనేది ఈ టీజర్ చూస్తే స్పష్టమవుతుంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి