సినిమా అనేది వ్యాపారం కాదు – విష్ణు మంచు

సినిమా అనేది వ్యాపారం కాదు – విష్ణు మంచు

Published on Jun 9, 2025 11:00 AM IST

డైనమిక్ హీరో విష్ణు మంచు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. కన్నప్ప చిత్రాన్ని జూన్ 27న విడుదల చేయబోతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన విష్ణు సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. విష్ణు మాట్లాడుతూ.. ‘సినిమా అనేది వ్యాపారం కాదు, అదొక ఫ్యాషన్. సినిమా పై ఆ పిచ్చి ప్రేమ ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో ఉండగలం. నేనెప్పుడూ సినిమాని బిజినెస్ లా చూడలేదు’ అంటూ విష్ణు చెప్పుకొచ్చాడు.

విష్ణు ఇంకా మాట్లాడుతూ.. ‘నా వరకూ నేను ఒక నటుడిగా ఉండటానికే ఇష్టపడతాను. నటన అంటే నాకు ఆసక్తి’ అంటూ విష్ణు తెలిపాడు. ఇక కన్నప్ప విషయానికి వస్తే.. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి ఎంతోమంది అగ్ర నటీనటులు కనిపించనున్న విషయం తెలిసిందే. పైగా మోహన్ బాబుతో పాటు కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, మధుబాల, ముఖేష్ రిషి, కరుణాస్, యోగి బాబు, బ్రహ్మనందం, సప్తగిరి రఘు బాబు, ఐశ్వర్య రాజేష్, దేవరాజ్, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా (విష్ణు కూతుళ్లు) ఇలా భారీ తారగణంతో ఈ మూవీ తెరకెక్కుతోంది.‌ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. నటుడు మోహన్ బాబు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కన్నప్ప సినిమాను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు