‘మెగాస్టార్ సినిమా పై క్రేజీ గాసిప్ ?

‘మెగాస్టార్ సినిమా పై క్రేజీ గాసిప్ ?

Published on Jun 8, 2025 9:00 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతుంది. ఐతే, ఇప్పుడు ఈ సినిమా పై మరో క్రేజీ గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్ డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నారని.. మెగాస్టార్ రెండు పాత్రల్లో ఒక పాత్ర వింటేజ్ చిరంజీవిని గుర్తుకు తెస్తోంది అని, ఇక మరో పాత్ర ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉంటుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ – నయనతార ల పై ఫ్యామిలీ సీన్స్ ను షూట్ చేస్తున్నారట. ఈ సీన్స్ లో మెగాస్టార్ – నయనతార మధ్య కామెడీ ఎపిసోడ్ చాలా బాగుంటుందని, అలాగే సినిమాలో ఈ ఎపిసోడ్ చాలా హైలైట్ అవుతుందని తెలుస్తోంది.

కాగా ఈ సినిమా గురించి మెగాస్టార్ ఆ మధ్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని.. ఈ మూవీ కథ తనకు నచ్చిందని చిరు ఆల్ రెడీ చెప్పారు. అన్నట్టు, అనిల్ రావిపూడి చెప్పే సీన్స్ గురించి కూడా మెగాస్టార్ చెబుతూ.. ‘సినిమాలో ఆయా సన్నివేశాల గురించి అనిల్‌ రావిపూడి నాకు చెబుతుంటే కడుపుబ్బా నవ్వుతున్నాను. ఈ సినిమా కచ్చితంగా అభిమానులకు నచ్చుతుంది’ అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తారని చిరు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు