ఇంట్రెస్టింగ్ గా ‘శంబాల’ టీజర్!

ఇంట్రెస్టింగ్ గా ‘శంబాల’ టీజర్!

Published on Jun 7, 2025 1:00 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా ఒక సరైన హిట్ కోసం చూస్తున్నాడు. తన కెరీర్లో ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్ట్ లని చేస్తూ వస్తున్న తన నుంచి వస్తున్నా మరో ఇంట్రెస్టింగ్ చిత్రమే “శంబాల”. దర్శకుడు యుగంధర్ ముని తెరకెక్కించిన ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ టీజర్ కట్ ని ఇపుడు విడుదల చేశారు.

సైన్స్ కి కూడా అందని ప్రశ్నలు ఒకవేళ వాటికి సమాధానం దొరికితే దాని గొప్పదనం ఏంటి అనే ఆసక్తికర లైన్స్ తో మొదలైన ఈ టీజర్ లో ఒక ఊరిలో పడ్డ ఉల్క ప్రభావం ఆ ఊరిపై ఎలా మార్పులు చూపించింది. ఊహించని విధంగా అక్కడ మారిన పరిణామాలు వాటికి సమాధానంగా ఎదురొడ్డి నిలిచిన పవర్ఫుల్ వ్యక్తిగా ఆది సాయి కుమార్ స్టన్నింగ్ గా కనిపిస్తున్నాడు.

అలాగే శ్రీచరణ్ పాకాల సంగీతం ఈ టీజర్ లో మరింత ఎఫెక్టీవ్ గా ఉందని చెప్పాలి. అయితే టీజర్ లోనే ఇంత ఉంటే ట్రైలర్ లో ఎలా ఉంటుందో చూడాలి. అయితే ఈ టీజర్ వి ఎఫ్ ఎక్స్ ఎక్స్ వర్క్ మాత్రం ఇంకా ఇంప్రూవ్ చేయాల్సింది. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. ఇక ఈ సినిమాని షైనింగ్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తుండగా అతి త్వరలోనే రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు