పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్ అలాగే మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రమే “ది రాజా సాబ్” కోసం అందరికీ తెలిసిందే. అయితే హ్యారీ పోటర్ రేంజ్ లో హెవీ గ్రాఫిక్ వర్క్స్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి టీజర్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా టీజర్ పై పలు రూమర్స్ అలా ఈ మధ్య కొనసాగుతున్నాయి.
ఇక ఫైనల్ గా ఇందుకు డేట్ లాక్ అయ్యినట్టుగా లేటెస్ట్ టాక్ వినిపిస్తుంది. దీని ప్రకారం రాజా సాబ్ టీజర్ ని మేకర్స్ ఈ జూన్ 16న విడుదల చేస్తున్నట్టుగా సమాచారం. ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఒకటి ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్ తో ఒక రొమాంటిక్ హారర్ ఫాంటసీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు.