జూన్ నెలలో వినోదాల విందు రెట్టింపు కానుంది. ఇక జూన్ మొదటి వారంలో వేసవి వినోదాల విందును పంచడానికి పలు చిత్రాలు రెడీ అయ్యాయి. ఈ వారం ‘థగ్‌లైఫ్’, నార్నె నితిన్ ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’, ‘హౌస్‌ఫుల్’, ‘గ్యాంబ్లర్స్’, ‘బద్మాషులు’ వంటి చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే
నెట్ ఫ్లిక్స్ :
వన్ ఆఫ్ దెమ్ డేస్ (హాలీవుడ్) – జూన్ 04 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జాబ్ (హిందీ) – జూన్ 05 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ :
స్టోలెన్ (హిందీ) – జూన్ 04 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జియో హాట్‌స్టార్ :
టూరిస్ట్ ఫ్యామిలీ (తమిళ/తెలుగు) – జూన్ 02 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
గజానా (హిందీ) – జూన్ 02 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
దేవికా అండ్ డానీ (తెలుగు సిరీస్) – జూన్ 06వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.