‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ ఇంకెప్పుడు?

‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ ఇంకెప్పుడు?

Published on Jun 1, 2025 9:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా బాబీ డియోల్ ఇంకా తదితర స్టార్ నటీనటుల కలయికలో దర్శకులు క్రిష్ జాగర్లమూడి అలాగే జ్యోతి కృష్ణలు తెరకెక్కించిన భారీ పీరియాడిక్ చిత్రమే “హరిహర వీరమల్లు”. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇలాంటి తరహా సినిమా మొదటిది కావడంతో అనౌన్స్ చేసిన నాటికి భారీ అంచనాలే నెలకొన్నాయి. కానీ సినిమా అలా ఆలస్యం అవుతూ వచ్చింది.

ఐదేళ్లు కూడా అయ్యిపోయాయి. మరి ఈ నేపథ్యంలో ఎట్టకేలకి రిలీజ్ డేట్ ని ఈ సినిమా ఫిక్స్ చేసుకుంది కానీ ఇప్పుడుకి కూడా ఎలాంటి ట్రైలర్ లేకుండానే మేకర్స్ నెట్టుకొచ్చేస్తున్నారు. ఇంకా 11 రోజుల సమయమే ఉన్నప్పటికీ కీలకమైన ట్రైలర్ ఫుటేజ్ రాకపోవడంతో అభిమానులు కాకుండా మిగతా ఆడియెన్స్ కి సినిమాకి దూరాన్ని ఇంకా పెంచినట్టుగా మారుతుంది. మరి మేకర్స్ ఈ ట్రైలర్ ని ఇంకెప్పుడు విడుదల చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు