SSMB29 ఆఫర్‌ని రిజెక్ట్ చేసిన సీనియర్ నటుడు..?

SSMB29 ఆఫర్‌ని రిజెక్ట్ చేసిన సీనియర్ నటుడు..?

Published on May 29, 2025 8:02 AM IST

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం SSMB29 కోసం ప్రేక్షకులతో పాటు సినీ సర్కిల్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటించనున్నారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

కాగా, ఈ సినిమాలో ఓ భారీ ఛాన్స్ వచ్చినా, ఓ సీనియర్ నటుడు దానిని రిజెక్ట్ చేశాడని తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పాటేకర్‌ను ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో నటించేందుకు రాజమౌళి అండ్ టీమ్ అప్రోచ్ అయ్యారట. అయితే, ఆ పాత్ర ఆయనకు నచ్చకపోవడంతో దానిని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇలా రాజమౌళి సినిమాలో ఆఫర్‌ని రిజెక్ట్ చేయడంతో నానా పాటేకర్ గురించిన వార్త బాలీవుడ్ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు