ఓటిటి సమీక్ష: ‘వైరల్ ప్రపంచం’ – తెలుగు చిత్రం సన్ నెక్స్ట్ లో ప్రసారం

ఓటిటి సమీక్ష: ‘వైరల్ ప్రపంచం’ – తెలుగు చిత్రం సన్ నెక్స్ట్ లో ప్రసారం

Published on May 28, 2025 2:54 PM IST

Viral Prapancham

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : మే 23, 2025
స్ట్రీమింగ్‌ వేదిక : సన్ నెక్స్ట్

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : ప్రియాంక శర్మ, నిత్యా శెట్టి, సాయి రోనక్, సన్నీ నవీన్
దర్శకులు : బ్రిజేష్ తంగి
నిర్మాణం : సిల్లీ మాంక్స్ టాలీవుడ్
సంగీత దర్శకుడు : గ్యాని
సినిమాటోగ్రఫీ : వరుణ్ అంకర్ల
ఎడిటింగ్ : జిఎస్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

రీసెంట్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చిన చిత్రాల్లో సన్ నెక్స్ట్ ఓటిటి యాప్ లో వచ్చిన చిత్రం ‘వైరల్ ప్రపంచం’ కూడా ఒకటి. సవారీ ఫేమ్ ప్రియాంక శర్మ తదితర యువ నటీనటులు నటించిన ఈ చిత్రం పలు వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

కథ:

ప్రస్తుతం ఉన్న ట్రెండీ యుగంలో ఆడవారి నడత పట్ల కోపంగా ఉండే ఒక ఐడియల్ హ్యూమన్ (?) అనే సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి ఒకరు సోషల్ మీడియాలో కోపంగా ఉంటూ ఉంటాడు. ఇంకోపక్క కొన్నాళ్ల నుంచి ప్రేమించుకుంటున్న జంట రవి (సాయి రోనక్) అలాగే స్వప్న ఠాకూర్ (ప్రియాంక శర్మ) లు ఆమె యూఎస్ వెళ్లడంతో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్ లో ఉంటారు. అలాగే స్వప్న అంటే ఎంతో ఇష్టమైన అదితి (నిత్య శెట్టి) కూడా ఒక అనాథ కావడంతో ఆమె వెళ్ళిపోయాక ఒంటరిగా ఫీలవుతుంది. ఈ సమయంలో ప్రవీణ్(సన్నీ నవీన్) అనే కుర్రాడిని ఆన్లైన్ ద్వారా కలుస్తుంది. తర్వాత ఒకే ఒక్కసారి మీట్ అవుతుంది. అక్కడ నుంచి వీరు కూడా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్ లో ఉంటారు. ఇలా ఈ రెండు జంటల మాటలు ప్రైవేట్ గా మారుతాయి. ఇంకోపక్క ఆన్లైన్ లో రివెంజ్ పోర్న్ అనేది పెరుగుతుంది? మరి వారి ప్రైవేట్ మాటలు ఎటు దారి తీశాయి? ఈ రివెంజ్ పోర్న్ అంటే ఏంటి? ఆ ఐడియల్ హ్యూమన్ ఎవరు? దాని వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

మొదటిగా ఈ సినిమా దర్శకుడు ఎంచుకున్న రివెంజ్ పోర్న్ అనే పాయింట్ బాగుందని చెప్పాలి. చాలామందికి తెలియని విషయాన్ని సినిమా ద్వారా మరింతమందికి తెలిపేలా చేసి ఒక సందేశాన్ని అవగాహన కల్పించేలా ప్రయత్నం చేయడం బాగుంది. ముఖ్యంగా సినిమా ద్వితీయార్థం నుంచి మరింత ఆసక్తిగా మారింది అని చెప్పవచ్చు.

లీడ్ నటీనటులు నలుగురు కూడా సాలిడ్ పెర్ఫామెన్స్ లని అందించారు. సస్పెన్స్ ఫ్యాక్టర్ ని దర్శకుడు నెమ్మదిగా బిల్డప్ చేస్తూ ఒకొకటిగా రివీల్ చేస్తూ వెళ్లడం బాగుంది. అలాగే ఒకో పాత్రకి ఒక అర్ధవంతమైన ముగింపు ఇవ్వడంతో మొత్తం కథకి ముగింపు కూడా ప్రాపర్ గా అనిపిస్తుంది.

సాయి రోనక్ చాలా బాగా నటించాడు. తన గర్ల్ ఫ్రెండ్ విషయంలో స్వాధీనత (Possesivenes) సహా ఇతర భావోద్వేగాలని బాగా చేసాడు. అలాగే ప్రియాంక శర్మ కూడా తన రోల్ కి బాగా ఫిట్ అయ్యింది. అంతే బాగా చేసింది కూడా ఇంకా నిత్యా శెట్టి కూడా తన రోల్ లో పర్ఫెక్ట్ గా కనిపించింది. వీరి పాత్రలపై కనిపించే ఎమోషన్స్ కొన్ని సెకండాఫ్ లో బాగున్నాయి.

అలాగే సర్ప్రైజ్ క్యామియో గౌరి జి కిషన్ పాత్ర బలంగా ఉంది. తనకి సినిమాలో మెయిన్ పాయింట్ కి కనెక్షన్ బాగుంది అంతే కాకుండా ఇది వరకు చూసిన పలు సినిమాల్లో కంటే చాలా డిఫరెంట్ గా ఈమె కనిపించింది అని చెప్పవచ్చు. ఇక వీరితో పాటుగా ఇతర నటీనటులు బాగానే చేసేసారు.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రంలో మంచి సందేశాత్మగా పాయింట్ ఉన్నప్పటికీ ప్రథమార్ధంలో సినిమా మాత్రం చాలా డల్ అండ్ రొటీన్ గానే సాగుతుంది. దాదాపు ఫస్టాఫ్ లో అంతా తెరపై చూపించే విజువల్స్ ఇంటర్నెట్ చాటింగ్స్, లాంటి వాటిపైనే కొనసాగడం రిపీటెడ్ గా బోరింగ్ గా అనిపిస్తాయి.

అలాగే ఇదే తరహాలో చాలా సినిమాలు వచ్చాయి కదా అనే భావనని కూడా కలిగిస్తాయి. ఇదే తతంగం మెయిన్ పాయింట్ లోకి వెళ్లే వరకు కొనసాగుతుంది. సో ఈ అంశాలు ఒకింత బోరింగ్ గా అనిపిస్తాయి. సో ఇలాంటి వాటిని కొంచెం తగ్గించి ఉన్న తక్కువ నిడివి లోనే కుదించి ఉంటే ఈ థ్రిల్లర్ మరింత ఎంగేజింగ్ గా ఉండేది.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా తగ్గట్టుగా మేకర్స్ మంచి నిర్మాణ విలువలు పాటించారు. అలాగే క్యాస్టింగ్ పరంగా కూడా తీసుకున్న జాగ్రత్తలు బాగున్నాయి. సంగీత దర్శకుడు గ్యాని ఇచ్చిన వర్క్ బాగుంది. అలాగే వరుణ్ అంకర్ల ఇచ్చిన సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటర్ జీఎస్ పనితనం కూడా బాగుంది కానీ ఫస్టాఫ్ లో ఏమన్నా చేసి కథనంని ఇంకొంచెం ఎంగేజింగ్ గా మార్చాల్సింది.

ఇక దర్శకుడు బ్రిజేష్ తంగి విషయానికి వస్తే తాను ప్రస్తుతం కొనసాగుతున్న ఆన్లైన్ క్రైమ్ లలో కొత్త పాయింట్ ని తీసుకొని ఆడియెన్స్ కి చెప్పే ప్రయత్నం బాగుంది. అయితే తన కథనంలో దాదాపు అన్ని మూమెంట్స్ ని బాగానే హ్యాండిల్ చేశారు కానీ ఫస్టాఫ్ లో కథనం కూడా బెటర్ గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. ఇది మినహా మిగతా అన్ని అంశాల్లో తన వర్క్ రాబట్టుకున్న విధానం బాగుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘వైరల్ ప్రపంచం’ చిత్రంలో కనిపించే నేపథ్యం, నటీనటుల పెర్ఫామెన్స్ లు అలాగే సెకండాఫ్ లో కథనం పాత్రల ముగింపులు వంటివి బాగున్నాయి. డెఫినెట్ గా ప్రస్తుత కాలంలో అందరు చూడదగిన సినిమా ముఖ్యంగా యువత, ఆడపిల్లలు చూడాల్సిన సినిమా ఇది. అయితే ఓవరాల్ సినిమా పరంగా చూస్తే ఫస్టాఫ్ లో కొంచెం రొటీన్ ట్రీట్మెంట్ కనిపిస్తుంది. ఇది మినహాయిస్తే ఈ చిత్రాన్ని ఓటిటిలో సమయం కుదిరితే తప్పక వీక్షించవచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు