అక్కినేని వారి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో మ్యాచో మ్యాన్ అఖిల్ అక్కినేని కూడా ఒకరు. మరి అఖిల్ హీరోగా ఇపుడు చేస్తున్న సాలిడ్ చిత్రమే ‘లెనిన్’. అయితే ఈ చిత్రం రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఆ మధ్య అఖిల్ సోదరుడు అక్కినేని నాగ చైతన్య పెళ్లి వార్త తోనే తన పెళ్లిపై కూడా వార్తలు కన్ఫర్మ్ అయ్యాయి.
మరి లేటెస్ట్ గా అఖిల్ పెళ్ళికి మొత్తానికి డేట్ లాక్ అయ్యినట్టుగా తెలుస్తుంది. అఖిల్, జైనబ్ ని పెళ్లి చేసుకోనుండగా వీరి వివాహానికి ఇపుడు డేట్ ఫిక్స్ అయ్యిందట. దీనితో ఈ రానున్న రెండు వారాల్లోనే అంటే జూన్ మొదటి వారం 6న జరగనుందట. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక లెనిన్ షూటింగ్ ఇపుడు భారీ సెట్టింగ్స్ లో జరుగుతుండగా ఈ ఏడాది నవంబర్ కి రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.