మన టాలీవుడ్ స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “అనగనగా ఒకరాజు”. అయితే ఎప్పుడో స్టార్ట్ చేసినప్పటికీ ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. మరి లేటెస్ట్ గా ఈ ఎంటర్టైనర్ కి డేట్ ని మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ ఫన్ ప్రోమోతో రివీల్ చేసేసారు. దర్శకుడు మారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతి బరికి సిద్ధం చేసేసారు.
ఆల్రెడీ అప్పుడు భారీ సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ రేస్ లో అనౌన్స్ చేయడం మేకర్స్ కాన్ఫిడెన్స్ అని చెప్పవచ్చు. అన్నట్టు ఈ సినిమాని మేకర్స్ జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. సో నవీన్ ఆరోజు నుంచి తెలుగు ఆడియెన్స్ కి ఎంటర్టైన్మెంట్ ని అందించనున్నాడని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి