‘అఖండ 2’లో బాలయ్యపై మరో సర్ప్రైజ్!

‘అఖండ 2’లో బాలయ్యపై మరో సర్ప్రైజ్!

Published on May 25, 2025 3:00 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇపుడు చేస్తున్న అవైటెడ్ మాస్ సీక్వెల్ చిత్రమే “అఖండ 2”. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న భారీ ఫీస్ట్ చిత్రంపై ఎనలేని హైప్ ఉంది. ఇలా హైప్ తగ్గట్టుగానే మేకర్స్ సాలిడ్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఓ ఇంట్రెస్టింగ్ టాక్ ఇపుడు బాలయ్యపై వినిపిస్తుంది. నిజానికి బాలయ్య ఈ చిత్రం రెండు షేడ్స్ లో మాత్రమే అంటే దాదాపు రెండు లుక్స్ లో మాత్రమే కనిపిస్తారని తెలిసిందే.

కానీ బోయపాటికి మరో ప్లాన్ కూడా ఉందట. దీనితో బాలయ్యపై మూడో లుక్ కూడా ఉందని తెలుస్తుంది. ఇది కూడా ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చే రీతిలోనే ఉంటుంది అని టాక్. మరి ఇదెప్పుడు రివీల్ అవుతుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే ఫస్ట్ లుక్ సహా టీజర్ జూన్ లోనే బాలయ్య బర్త్ డే కానుకగా వస్తాయని తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు