థగ్ లైఫ్ : టైటిల్ వెనక అసలు కథ ఇదే!

థగ్ లైఫ్ : టైటిల్ వెనక అసలు కథ ఇదే!

Published on May 22, 2025 8:00 AM IST

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కలిసి ఓ సినిమా చేశారు. ‘థగ్ లైఫ్’ సినిమాతో వీరిద్దరు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమువుతున్నారు.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పై కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను దర్శకుడు మణిరత్నం పంచుకున్నారు. ఈ చిత్రానికి చాలా టైటిల్స్ పరిశీలించామని, అయితే ‘థగ్ లైఫ్’ అనే టైటిల్ ని కమల్ స్వయంగా ప్రకటించారని.. ఈ టైటిల్ అందరికీ నచ్చడంతో దీన్నే ఫిక్స్ చేశామని ఆయన తెలిపారు.

ఈ సినిమాలో శింబు, త్రిష, అశోక్ సెల్వన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జూన్ 5న గ్రాండ్ రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు