‘బలుపు’ నైజాం రైట్స్ తీసుకున్న దిల్ రాజు

‘బలుపు’ నైజాం రైట్స్ తీసుకున్న దిల్ రాజు

Published on Jun 5, 2013 2:10 PM IST

Balupu-(8)

మాస్ మహారాజ రవితేజ ‘బలుపు’ సినిమా నైజాం రైట్స్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా నిర్వాహకులు ఈ సినిమాని జూన్ మూడవ వారంలో విడుదలచేయాలనుకుంటున్నారు. రవితేజ సరసన శృతి హసన్, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి మంచి లాబాలు వస్తాయని దిల్ రాజు చాలా నమ్మకంగా వున్నాడు. అందుకే ఈ సినిమాని ఫాన్సీ ధరకి తీసుకోవడం జరిగిందని సమాచారం. పీవీపీ సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో చాలా రోజుల తరువాత రవితేజ పవర్ ఫుల్ పాత్రలో, పూర్తి మాస్ గా కనిపించనున్నాడు.

తాజా వార్తలు