Good Bad Ugly OTT: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఓటిటి డేట్ ఫిక్స్!

Good Bad Ugly OTT: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఓటిటి డేట్ ఫిక్స్!

Published on May 3, 2025 12:01 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “గుడ్ బ్యాడ్ అగ్లీ” కోసం అందరికీ తెలిసిందే. మరి అజిత్ ఫ్యాన్స్ కి ఒక ఫ్యాన్ ట్రీట్ సినిమాలా వచ్చిన ఈ చిత్రం అజిత్ కెరీర్లో భారీ హిట్ అయ్యింది. ఇక ఇలా థియేటర్స్ లో సందడి చేసిన తర్వాత ఓటిటిలో రిలీజ్ కి ఈ చిత్రం ఇపుడు సిద్ధం అయ్యింది.

ఈ చిత్రం తాలూకా ఓటిటి హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే నేడు నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా పాన్ ఇండియా డేట్ ని ఇచ్చేసింది. ఈ మే 8 నుంచి ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా ఖరారు చేశారు. సో ఇంకొన్ని రోజుల్లో అజిత్ మాస్ సంభవం ఓటిటి ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు