ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’

ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’

Published on May 2, 2025 8:59 AM IST

మన తెలుగు బుల్లితెర ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఎంతో దగ్గరైన యువ యాంకర్స్ లో యాంకర్ ప్రదీప్ కూడా ఒకడు. అయితే ప్రదీప్ బుల్లితెర నుంచి వెండి తెరపైకి హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా తన నుంచి రీసెంట్ గా వచ్చిన రెండో సినిమానే ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’.

అదే స్మాల్ స్క్రీన్ నటి దీపికా పిల్లి హీరోయిన్ గా ‘ఢీ’ షో దర్శకుడు నితిన్, భరత్ లు తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ని చూసిన ఆడియెన్స్ నుంచి అందుకుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా ఓటిటి రిలీజ్ కి సిద్ధం అయ్యింది.

ఈ సినిమా హక్కులు మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ మే 8 నుంచి అందుబాటులోకి రానుంది అని ఈటీవీ విన్ వారు అధికారికంగా అనౌన్స్ చేశారు. మరి అప్పుడు మిస్ అయ్యినవారు ఇంకొన్ని రోజుల్లో ఈటీవీ విన్ లో వీక్షించవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు