ఈ వారాంతరంలో ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ఇద్దరు యువ తారల మధ్య పోటీ జరగనుంది. వాళ్లే నాగ చైతన్య మరియు ఆది. నాగ చైతన్య’తడాఖా’, ఆది ‘సుకుమారుడు’ సినిమాలు ఈరోజే విడుదల అవుతున్నాయి. రెండిటికీ రిపోర్ట్లు ఆశాజనకంగానే కనిపిస్తున్నాయి. ‘తడాఖా’ సినిమాలో నాగ చైతన్య, సునీల్, తమన్నా మరియు ఆండ్రియా నటిస్తున్నారు. కిషోర్ పర్దాన్సి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు బెల్లంకొండ సురేష్ నిర్మాత. ఈ సినిమా గత కొన్ని చిత్రాలుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగ చైతన్యకు తప్పకుండా హిట్ ఇస్తుందని నాగ చైతన్య, నాగార్జున చాలా నమ్మకంగా వున్నారు.
ఇదిలా వుంటే ఆది కెరీర్ బలంగా నిలదొక్కుకోవాలంటే ‘సుకుమారుడు’ సినిమా విజయం సాదించడం చాలా అవసరం. అతను ఇదివరకు నటించిన ‘ప్రేమకావాలి’, ‘లవ్లీ’ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాదించాయి. ఈ తరుణంలో అతనికి హిట్ వస్తే ఒక మంచి స్టార్ గా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాదించిన ఏకైక సమ్మర్ సినిమాగా నిలిచింది. ఇప్పుడు ఈ రెండు సినిమాలలో ఏ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతుందో చూడాలి.