చివరి దశలో ‘పైసా’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు

చివరి దశలో ‘పైసా’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు

Published on May 9, 2013 12:20 PM IST

paisa-movie-stills-4

నాని హీరోగా నటిస్తున్న సినిమా ‘పైసా’. ఈ సినిమా పోస్ట్ -ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో వున్నాయి. ఈ సినిమా జూన్లో విడుదలకు సిద్దమవుతుంది. కేథరిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి కృష్ణవంశీదర్శకత్వం వహిస్తున్నాడు. యెల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై రమేష్ పుప్పాల నిర్మిస్తున్నాడు. నాని ఈ సినిమాలో డబ్బు సంపాదించడమే ద్యేయంగా గల ప్రకాష్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా స్టోరీ హవాల,మనీ లాండరింగ్ మొదలగు వాటి చుట్టూ తిరుగుతూ వుంటుంది. అలాగే ఇద్దరు వేరువేరు సాంప్రదాయాలకు సంబందించిన వారి మద్య జరిగే ప్రేమ సన్నివేశాలు కూడా ఈ సినిమాలో కీలకం కానున్నాయి. చరణ్ రాజ్ ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నాడు. కృష్ణ వంశీ ఈ సినిమాతో తిరిగి కమర్షియల్ హిట్ అందుకోవాలనుకుంటున్నాడు. ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

తాజా వార్తలు