చిట్ చాట్ : ఆది – జిమ్ కారీ, చిరంజీవి గారే నాకు స్ఫూర్తి..

చిట్ చాట్ : ఆది – జిమ్ కారీ, చిరంజీవి గారే నాకు స్ఫూర్తి..

Published on May 7, 2013 9:00 PM IST

AADI
డైలాగ్ కింగ్ సాయి కుమార్ వారసుడుగా ‘ప్రేమ కావాలి’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఆది మొదటి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘లవ్లీ’ సినిమాతో రెండవ విజయాన్ని అందుకున్న ఆది హ్యాట్రిక్ సాధించాలనే ఉద్దేశంతో ‘సుకుమారుడు’ అనే సినిమాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సందర్భంగా హీరో ఆది మీడియా మిత్రులతో కాసేపు కాసేపు ముచ్చటించి సినిమా విశేషాలను మాతో పంచుకున్నారు. ఆవిశేశాలు మీ కోసం..

ప్రశ్న) ఈ సినిమా పై మీకున్న అంచనాలేమిటి?

స) ‘సుకుమారుడు’ సినిమా కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాను. సినిమా చాలా బాగా వచ్చింది, ఈ సినిమా పై మా అందరికీ బాగానే అంచనాలున్నాయి. డైరెక్టర్ అశోక్ సినిమాలోని ప్రతి పాత్రని చాలా బాగా తీర్చి దిద్దాడు. నా పాత్ర కూడా చాలా కొత్తగా ఉంటుంది, అలాగే నా పాత్రలో చాలా రకాల షేడ్స్ ఉంటాయి.

ప్రశ్న) పలు కారణాల వల్ల సినిమా ఆలస్యమయినట్టు ఉంది?

స) ఈ సినిమాలో సుమారు 60 మంది నటీనటులు నటించారు కాబట్టి సినిమా కాస్త ఆలస్యమైంది, కానీ ఆలస్యానికి తగ్గా ఫలితం ఉంటుంది. సినిమాలో ఎంటర్టైనింగ్ సీన్స్ చాలా ఉంటాయి. ఉదాహరణకి .. సినిమాలో సీనియర్ ఎన్.టి.ఆర్ గారి డైలాగ్స్ చెబుతాను. నేను ఎన్.టి.ఆర్ గారు ఎలా చెప్పారో అలా చెప్పలేదు కానీ బాగానే చెప్పానని అనుకుంటున్నాను. (అప్పుడు ఆది ఎన్.టి.ఆర్ గారి ‘దాన వీర శూర కర్ణ’ మూవీలో మయసభ సీన్ లో ఎన్.టి.ఆర్ గారు చెప్పే లాంగ్ డైలాగ్ ని చెప్పారు. డైలాగ్ ని బాగా చెప్పాడు).

ప్రశ్న) ఈ సినిమాలోని మీ పాత్ర కోసం ఎవరినన్నా స్పూర్తిగా తీసుకున్నారా?

స) నేను జిమ్ కారీని స్పూర్తిగా తీసుకున్నాను. అలాగే సినిమాలో కామెడీని – బాధని ఒకేసారి పండించాల్సిన సీన్స్ ఉన్నాయి. అవి నాకు చాలెంజింగ్ గా అనిపించాయి కానీ అవన్నీ సినిమా చివర్లో వస్తాయి.

ప్రశ్న) మీ ప్రతి సినిమాకి అనూప్ రూబెన్స్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకుంటున్నారు..

స) అవును. అనూప్ చేసే పనితీరు అంటే నాకు చాలా ఇష్టం. చాలా మంచి మ్యూజిక్ ఇస్తాడు, మా ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ముందు ముందు కూడా అతనితో కలిసి పనిచేస్తాను.

ప్రశ్న) హీరోయిన్ నిషా అగర్వాల్ పాత్ర గురించి చెప్పండి?

స) ఈ సినిమాలో నిషా అగర్వాల్ ఓ పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపిస్తుంది. యంగ్ అండ్ టాలెంట్ ఉన్న నిషా అగర్వాల్ సినిమాలో చక్కని నటనని కనబరిచింది.

ప్రశ్న) ఈ మూవీలో ఇంకేమన్నా ప్రత్యేకతలు ఉన్నాయా?

స) సూపర్ స్టార్ కృష్ణ గారు, ఊర్వశి శారద గారు ఈ సినిమాకి ప్రత్యేక హైలైట్. కృష్ణ గారిది చాలా చిన్న పాత్ర కానీ సినిమాకి చాలా కీలకం. ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. శారద గారి చాలా సూపర్బ్ గా నటించారు. ఆమె పాత్ర ఈ సినిమాకి మేజర్ హైలైట్ అవుతుంది.

ప్రశ్న) డైరెక్టర్ అశోక్ పనితనంతో మీరు సంతృప్తి చెందారా?

స) అవును. అతను చాలా మంచి డైరెక్టర్, ‘పిల్ల జమిందార్’ సినిమాని చాలా బాగా తీసారు. ఈ మూవీని ఇంకా స్పెషల్ కేర్ తీసుకొని చేసాడు. చెప్పాలంటే ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత సినిమాలో నటించిన వారిని వదిలేసి వారు పోషించిన పాత్ర గురించి మాట్లాడుకుంటారు.

ప్రశ్న) చూస్తుంటే మీకు డాన్సులంటే బాగా ఇష్టంగా అనిపిస్తోంది..

స) అవును. నేను చిరంజీవి గారి డాన్సులకి పెద్ద ఫ్యాన్, డాన్సుల విషయంలో ఆయనే నాకు స్ఫూర్తి. ఆయనలాగా డాన్సులు చేయాలనుకుంటూ పెరిగాను. ఈ సినిమాలో ‘సుకుమారుడు సుకుమారుడు’ సాంగ్ స్పెషల్ హైలైట్ అవుతుంది. ఈ పాటకి బాబా భాస్కర్ కొరియోగ్రఫీ చేసారు.

ప్రశ్న) సాయి కుమార్ గారు సినిమా చూసారా?

స) నాన్న గారు సినిమా స్టొరీ లైన్ మాత్రం విన్నారు. పాటల విషయంలో కేర్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకే విషయంలోనూ జోక్యం చేసుకోలేదు. సినిమా విడుదలైన తర్వాత ఆయన సినిమా చూస్తారు.

ప్రశ్న) ఈ సినిమా తర్వాత మీరు చేస్తున్న సినిమాలు ఏమున్నాయి?

స) ప్రస్తుతం సుబ్బారెడ్డి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాను. ఇప్పటికే 50% సినిమా షూటింగ్ పూర్తయ్యింది.

ప్రశ్న) సినీ ప్రేమికులు ‘సుకుమారుడు’ నుంచి ఏమేమి ఆశించవచ్చు?

స) ‘సుకుమారుడు’ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.ఈ మూవీలోని మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్ యువతని బాగా ఆకట్టుకుంటుంది. మేమంతా కలిసి ఒక ‘స్వచ్చమైన తెలుగు సినిమా’ తీసాం. వెళ్లి సినిమా చూడండి, చూసి ఎంజాయ్ చెయ్యండి.

అంతటితో ఆదితో మా చిట్ చాట్ ముగించాము. ఆది సినిమా హిట్ అవ్వాలని కోరుకుందాం.

CLICK HERE FOR ENGLISH INTERVIEW

తాజా వార్తలు