తమన్నా, ఆండ్రియాలకు కృతఙ్ఞతలు చెప్పిన బెల్లంకొండ

తమన్నా, ఆండ్రియాలకు కృతఙ్ఞతలు చెప్పిన బెల్లంకొండ

Published on May 7, 2013 11:56 AM IST

tadhaka

నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ రోజు ‘తడాఖా’ సక్సెస్ మీట్ లో హీరోయిన్స్ తమన్నా, ఆండ్రియాలకు కృతఙ్ఞతలు తెలియజేశారు. ఎందుకు చెప్పాడని మీరు అనుకుంటున్నారా అయితే ఇది చదవండి. ‘ ఈ రోజుల్లో చాలా మంది హీరోయిన్స్ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి రావడం లేదు. సినిమా పూర్తైన తరువాత వారు ఆ సినిమా గురించి ఎటువంటి బాద్యతలు తీసుకోవడం లేదు. కానీ ఇది కరెక్ట్ కాదు. మా సినిమా హీరోయిన్స్ హీరోలతో కలిసి ప్రెస్ మీట్ కు వచ్చారు. వారి వచ్చినందుకు ఈ కార్యక్రమానికి ఏంటో గ్రేస్ వచ్చింది. నేను స్పెషల్ గా తమన్నా, ఆండ్రియాలకు కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని బెల్లంకొండ సురేష్ అన్నాడు. ఈ ప్రెస్ మీట్ కి నాగ చైతన్య, సునీల్, తమన్నా, ఆండ్రియా, బెల్లంకొండ, డైరెక్టర్ డాలీ తదితరులు హాజరయ్యారు. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని సాదిస్తుందని ప్రొడక్షన్ టీం చాలా నమ్మకం గా వున్నారు.

తాజా వార్తలు