అలా చెప్పగలిగితేనే సినిమా సక్సెస్ అవుతుంది – చంద్రశేఖర్ యేలేటి

అలా చెప్పగలిగితేనే సినిమా సక్సెస్ అవుతుంది – చంద్రశేఖర్ యేలేటి

Published on May 5, 2013 5:50 PM IST

yeleti-chandrasekhar
వైవిధ్యమైన కాన్సెప్ట్ తో సినిమాలు తీసే చంద్రశేఖర్ యేలేటి దర్శకుడిగా మారి 10 సంవత్సరాలు పూర్తయ్యింది. కానీ ఆయన ఇప్పటి వరకూ చేసిన సినిమాలు నాలుగంటే నాలుగు. కొత్త కొత్త జోనర్స్ లో సినిమాలు తీసిన చంద్రశేఖర్ యేలేటికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. సుమారు 4 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న ఆయన చివరికి ‘సాహసం’ అనే యాక్షన్ అడ్వెంచర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఏటిఎం కి సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసే ఒకతను నిధి కోసం చేసే అన్వేషణే ఈ సినిమా కథ.

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చంద్ర శేఖర్ యేలేటి సినిమాలు ఎందుకు డిఫరెంట్ గా ఉంటాయి, అతని వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందనే ఆసక్తి కరమైన విషయాలను తెలిపాడు. ‘ టైంని బట్టి, డిమాండ్ ని బట్టి నా కథలని మార్చుకోను. ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారింది కానీ ప్రేక్షకులు ఇన్వాల్వ్ అయ్యేలా, తర్వాత ఎం జరుగుతుందా అనేంత ఆసక్తి కరంగా కథని చెప్పాలి. అదే సినిమా సక్సెస్ లో కీ రోల్ పోషిస్తుంది. ఎప్పుడైనా మనం ఎంచుకునే కథే సినిమాకి కెప్టెన్. అలాగే కేవలం కామెడీ ఉంటేనే సినిమా బాక్స్ ఆఫీసు వద్ద సక్సెస్ అవ్వదు ఎందుకంటే కామెడీ లేని చోట్ల ప్రేక్షకుడు బోర్ ఫీలవుతాడని’ అన్నాడు. గోపీచంద్, తాప్సీ, శక్తీ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. మే చివర్లో ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు