ప్రస్తుతం వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం సూపర్ స్టార్ మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా తదుపరి షెడ్యూల్ మే 9 నుండి ప్రారంభం కానుంది. ఈ తాజా షెడ్యూల్ మొత్తం హైదరాబాద్లో జరగనుంది. ఇటీవలే ఓ టీవీ కమర్షియల్ యాడ్ షూట్ కోసం ముంబై వెళ్ళిన మహేష్ అది ఫినిష్ చేసుకున్న మహేష్ ప్రస్తుతం ఫ్యామిలీతో హాలిడేలో ఉన్నాడు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా త్వరలోనే యూరప్ లో షూటింగ్ చెయ్యనున్నారు.
ఈ సినిమా ద్వారా కృతి సనన్ తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం కానుంది. కెల్లీ దోర్జీ విలన్ పాత పోషిస్తున్న ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మొదటి సారి మహేష్ బాబు సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.