ఆగడు పై వస్తున్న పుకార్లని ఖండించిన శ్రీను వైట్ల

ఆగడు పై వస్తున్న పుకార్లని ఖండించిన శ్రీను వైట్ల

Published on May 1, 2013 1:10 PM IST

srinu-vytla
కొంత కాలం క్రితం శ్రీను వైట్ల తన తదుపరి చిత్రం మహేష్ బాబు తో అని ప్రకటించారు .‘ఆగడు’ అని పేరు పెట్టిన ఈ చిత్రాన్ని అనీల్ సుంకర,రామ్ ఆచంట,గోపీచంద్ 14 రీల్స్ పతాకంపై నిర్మించనున్నారు . ‘దూకుడు’ తర్వాత ఈ నిర్మాతలు మహేష్ బాబు మరియు శ్రీను వైట్లతో మరోసారి జతకట్టనున్నారు. కొన్ని నెలల నుంచి మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా ఎవరు కనిపిస్తారు అనే విషయం పై చాలా పుకార్లు వచ్చాయి. చాలా మంది ప్రముఖ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. శ్రీను వైట్ల ఈ పుకార్లని ఖండించారు. “మీ ట్వీట్లని చూసాను .. హీరోయిన్ గురించి వచ్చిన వార్తలన్నీ అవాస్తవం ..ఇంకా మేం అంతిమ నిర్ణయం తీస్కోలేదు. అది ఎవరైనా కాని మీరు నా ద్వారా మాత్రమే తెల్సుకోగలరు”అని ట్విట్టర్లో పోస్ట్ చేసారు. ఈ ఏడాది లో ప్రారంభం కానున్న ఈ చిత్రం గురించి మరిన్ని విషయాలు నటీనటుల వివరాలు త్వరలో ప్రకటిస్తారు .

తాజా వార్తలు