రెట్టించిన ఉత్సాహంలో గుండెజారి గల్లంతయ్యిందే

రెట్టించిన ఉత్సాహంలో గుండెజారి గల్లంతయ్యిందే

Published on Apr 30, 2013 8:00 PM IST

GJG
నితిన్ నటించిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ఇప్పుడు తన కెరీర్లోనే అత్యంత విజయవంతమైన చిత్రంగా నిలిచింది. చాలా సెంటర్లలో ఈ సినిమా అద్బుతమైన వ్యాపారాన్ని జరుపుకుంటుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకు ఎదురునిలిచే సరైన ప్రత్యర్ధి లేకపోవడంతో రెండో వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమా ఏ సెంటర్లలో ముఖ్యంగా మల్టీప్లెక్స్ లలో మంచి వసూళ్లను రాబట్టుకుంటుంది.

శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ నిర్మించిన ఈ సినిమాను విజయ్ కుమార్ కుమార్ కొండా దర్శకత్వం వహించారు. అనూప్ రుబెన్స్ సంగీతం అందించాడు.

ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నితిన్ సరసన నిత్య మీనన్, ఇషా తల్వార్ నటించారు. ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే, హాస్యభరితమైన డైలాగులు ఈ సినిమాకు ప్రధాన బలం.

తాజా వార్తలు