పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రానున్న సినిమా యూరప్ షెడ్యూల్ జూన్ మొదటి వారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాని యూరప్ లో 25 రోలులు షూట్ చేయనున్నారు, దానికి సంబందించిన లోకేషన్స్ వేట వచ్చే వారం నుంచి మొదలు కానుంది. ఈ చిత్ర నిర్మాతలు ఎన్నడూ తెరపై చూపించని లోకేషన్స్ కోసం అన్వేషిస్తున్నారు. త్రివిక్రమ్ కూడా ఈ సినిమాలోని కొన్ని సీక్వెన్స్ లను చాలా గ్రాండ్ విజువల్స్ తో తియ్యాలని అనుకుంటున్నాడు.
ఈ సినిమాలో పవన్ సరసన సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘అత్తారింటికి దారేది’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా 2013 సెకండాఫ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.