మే రెండవ వారంలో విడుదలకానున్న ‘యాక్షన్ 3డి’

మే రెండవ వారంలో విడుదలకానున్న ‘యాక్షన్ 3డి’

Published on Apr 29, 2013 10:31 AM IST

Action-3d

కామెడీ కింగ్ అల్లరి నరేష్ నటించిన భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ సినిమా ‘యాక్షన్ 3డి’. ఈ సినిమా మే రెండవ వారంలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ – ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఫస్ట్ హాఫ్ రీ – రికార్డింగ్ ముగిసింది. ఇది ఇండియాలోనే మొదటి 3డి కామెడి సినిమా. అద్భుతమైన 3డి ఎఫెక్ట్ తో రియల్ 3డి ఫార్మేట్ లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అనిల్ సుంకర దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘కిక్’ శ్యాం, వైభవ్, రాజు సుందరం, బ్రహ్మానందంలు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. స్నేహ ఉల్లాల్, కామ్న జఠ్మలాని, నీలం ఉపాధ్యాయ్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి బప్పి లాహిరి సంగీతాన్ని అందించాడు.

తాజా వార్తలు