అంతా నీమాయలోనే అంటున్న నవదీప్

అంతా నీమాయలోనే అంటున్న నవదీప్

Published on Apr 28, 2013 5:00 PM IST

Antha-Nee-Mayalone
నవదీప్, స్నేహా ఉల్లాల్ జంటగా నటిస్తున్న ‘అంతా నీమాయలోనే’ సినిమా షూటింగ్ మొదలుకావడానికి సిద్ధమయింది. గత నెలలో ప్రారంభమయిన ఈ సినిమా మొదటి షెడ్యూల్ చిత్రీకరణ రేపటినుండి మొదలుకానుంది. మొదటి కొన్ని రోజులూ ఒక పాటను తియ్యనున్నారు. పి.వి కృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు సూర్యదేవర వినోద్ నిర్మాత. స్వరాజ్ సంగీతం అందిస్తున్నాడు. బినేంద్ర మీనన్ సినిమాటోగ్రాఫర్. పూనమ్ కౌర్ మరియు రాజేంద్ర ప్రసాద్ ఈ ఈ రొమాంటిక్ కామెడీలో ముఖ్య పాత్రలు పోషించనున్నారు.జూలైతో మొత్తం సినిమా చిత్రీకరణ పుర్తిచెయ్యనున్నారు. ‘అంతా నీమాయలోనే’ సినిమాయే కాక మరో సినిమాను కుడా ఒకే సమయంలో చేస్తున్న నవదీప్ ఆ పేరు పెట్టని సినిమా యొక్క మొదటి షెడ్యూల్ నిన్నటితో పూర్తిచేసాడు. ఆ సినిమాలో శశాంక్ మరియు రేయ్నా మల్హోత్ర ముఖ్య పాత్రధారులు. బ్యాడ్ మంకీ బ్యానర్ పై రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు