పి. సునీల్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ‘నేనేం చిన్నపిల్లనా’ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డీ. రామానాయుడు గారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ‘అందాల రాక్షసి’ ఫేం రాహుల్ హీరోగా నటిస్తున్నాడు. తన్వీ వ్యాస్ ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమవుతోంది. ‘ఈ సినిమా స్టోరీ మొత్తం ఒక యంగ్ అమ్మాయి చుట్టూ తిరుగుతూ వుంటుంది. పల్లెటూరిలో పుట్టినా అమ్మాయి సిటీ కి రావడం వల్ల ఆమెలో కలిగే మార్పులు, ఆమెకు ఎదురైనా సమస్యల గురించి ఈ సినిమాలో తెరకెక్కించనున్నాం.
అలాగే మంచి ఫ్యామిలీ వాల్యూస్ తో, లవ్, ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమాని నిర్మిస్తున్నాము. ఈ సినిమా పాటలని విదేశాలలో చిత్రికరించనున్నమని’ డీ రామానాయుడు గారు చెప్పారు. ఈ సినిమాలో సుమన్, శరత్ బాబు, కాశి విశ్వనాథ్ లు నటిస్తున్నారు. ఎం.ఎం. శ్రీలేఖ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి సాబు జేమ్స్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో కారంచేడులో జరగనుందని సమాచారం.