ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో రానున్న ‘అంతక ముందు ఆ తర్వాత’ సినిమా మేలో విడుదల కావడానికి సిద్దమవుతోంది. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఈష హీరోయిన్ గా నటించింది. శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై దామోదర్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ రోజు ఈ చిత్ర నటీనటులు, టెక్నికల్ టీం విశేషాలు తెలియజేయడం కోసం ప్రెస్ మీట్ పెట్టారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ ‘ మా బ్యానర్లో వస్తున్న 14వ సినిమా ఇది. ‘అలా మొదలైంది’ విడుదలైన 2 సంవత్సరాల తర్వాత రొమాంటిక్ డ్రామా ‘అంతక ముందు ఆ తర్వాత’ అనే సినిమాతో వస్తున్నాం. సుమంత్ అశ్విన్ నటన చాలా బాగుంది. ఈ సినిమాతో ఓ హీరోయిన్ ని పరిచయం చేస్తున్నాం. సుమారు 100 మందిని ఆడిషన్ చేసి చివరిగా ఈషని సెలెక్ట్ చేసామని’ అన్నాడు. ఇంద్రగంటి దామోదర్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన స్టొరీని తప్ప మిగతా దేన్నీ పట్టించుకోడని అన్నాడు. కల్యాణి కోడూరి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియోని మే మొదటి వారంలో విడుదల చేయనున్నారు, సినిమాని మే చివరి వారంలో రిలీజ్ చెయ్యనున్నారు.