భారీ ఎత్తున విడుదలకు సిద్దమవుతున్న ‘షాడో’

భారీ ఎత్తున విడుదలకు సిద్దమవుతున్న ‘షాడో’

Published on Apr 23, 2013 10:58 AM IST

Shadow
విక్టరీ వెంకటేష్ హీరోగా భారీ బడ్జెట్ తో నిర్మించిన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ‘షాడో’. ఈ సినిమా ఈ నెల 26న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమా నిర్మాణానికి ముందుగా అనుకున్న బడ్జెట్ లిమిట్ దాటి సుమారు రూ. 35 కోట్ల అయ్యింది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని పరుచూరి ప్రసాద్ నిర్మించాడు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన తాప్సీ హీరోయిన్ గా నటించింది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాలో ఎం.ఎస్ నారాయణ పూర్తి కామెడీ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో శ్రీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా, మధురిమ వెంకటేష్ చెల్లెలిగా కనిపించనున్నారు. ఈ సినిమాకు సెన్సార్ వారు యు/ఎ రేటింగ్ ని ఇచ్చారు.

తాజా వార్తలు