ప్రకాష్ రాజ్ ఓ సరికొత్త ఆఫర్ తో ఎన్నారైలకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఆయన తాజాగా నిర్మించిన ‘గౌరవం’ సినిమాని హై క్వాలిటీతో ఆన్ లైన్ లో చూడొచ్చు. చూడాలనుకున్న వారు వన్ డే పాస్ కోసం కేవలం 5 యుఎస్ డాలర్లు చెల్లించాలి. ఈ ఆఫర్ ఒక్క ఇండియా, యుఎస్ కి తప్ప మిగతా అన్ని దేశాలకు వర్తిద్తుంది. బోనస్ గా ఎవరైతే మే ఒకటి లోపు రిజిస్టర్ చేసుకొని సినిమా చూస్తారో వారు డైరెక్ట్ గా ధోనిని చూసే అవకాశాన్ని కొట్టేయొచ్చు. ఈ విషయం పై పూర్తి భాద్యత ప్రకాష్ రాజ్ గారే తీసుకున్నారు. మీరు అమౌంట్ కట్టిన తర్వాత ఫ్రీగా ధోనిని చూడొచ్చు. మీకు గౌరవం సినిమా చూడటానికి మరో 24 గంటలు టైం ఉంది. ఒకవేళ మీ ఇంటర్నెట్ కనెక్షన్ సరిగా లేనందువల్ల, లేదా చూసేటప్పుడు ఏమన్నా ఇబ్బందులు వచ్చినా మీ డబ్బు మీకు వెనక్కి ఇచ్చేస్తానని’ ప్రకాష్ రాజ్ చెప్పారు.
మరిన్ని వివరాల కోసం ఈ సైట్ ని విజిట్ చెయ్యండి – http://prakashrajlive.com .
ప్రకాష్ రాజ్ నుంచి వచ్చిన మరో మంచి సినిమా ‘గౌరవం’. ఇప్పుడు ఇతను పెట్టిన ఆఫర్ సక్సెస్ అయితే మిగతా నిర్మాతలు కూడా దీన్ని అయ్యే అవకాశం ఉంది