మే 10న విడుదలకాబోతున్న పవిత్ర

మే 10న విడుదలకాబోతున్న పవిత్ర

Published on Apr 21, 2013 8:10 PM IST
First Posted at 20:20 on Apr 21st

pavitra2

జనార్ధన్ మహర్షి దర్శకత్వంలో ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్లో శ్రేయ శరన్ ‘పవిత్ర’గా మనముందుకు రాబోతుంది. ఈ సినిమా యొక్క ట్రైలర్ ను ఈరోజు జనార్ధన్ మహర్షి ఆద్వర్యంలో విడుదల చేసారు. ఈ కార్యక్రమానికి ఏ.వి.ఎస్ మరియు చిత్ర నిర్మాతలు హాజరయ్యారు. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ “నేను తీసిన సినిమా ‘దేవస్థానం’ అవార్డులనే కాక విమర్శకుల ప్రశంసలను సైతం సంపాదించిపెట్టింది. ఆ ధోరణినుండి బయటకు రావడానికి నేను ఈ సినిమాని చెయ్యలేదు. శ్రేయ ఈ సినిమాలో చాలా గంభీరంగా నటించింది. తను ఈ పాత్రకు సరిగ్గా సరిపోయింది. నా చిత్ర నిర్మాతలు ఈ క్యారెక్టర్ కు ఎవర్ని తీసుకుందాం అని అడిగితే నేను మామోలుగా శ్రేయ పేరు చెప్పను, కాకపోతే ఆ మరుసటి రోజే నేను ఆమెకు ఈ కధను చెప్పి ఆమెను ఒప్పించగలగడం కుడా జరిగిపోయాయి. నేను పేపర్ లో చదివిన ఒక వార్త ప్రకారం ఒక రాష్ట్ర గవర్నర్ ఒక వేశ్యని అవమానపరిస్తే ఆ వేశ్య తదుపరి ఎన్నికలలో పాల్గుని ఆ గవర్నర్ నే ఓడించడం అనేది నా చిత్రకధకు ప్రేరణ”అని తెలిపారు.

ఈ సినిమాలో రోజా, సాయి కుమార్, షియాజీ షిండే మరియు శివాజీ ముఖ్యపాత్రలు పోషించారు. ఎం.ఎం శ్రీలేఖ సంగీతం అందించారు. ఈ సినిమా మే10న ప్రేక్షకులముందుకు రానుంది.

తాజా వార్తలు