యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ‘బాద్షా’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో ఏ సినిమాకి జరగనంత భారీ ఎత్తున చాలా గ్రాండ్ గా జరగనుంది. ఈ కార్యక్రమం హైదరాబాద్ నానక్రాంగూడాలోని రామానాయుడు స్టూడియోలో జరగనుంది. అలాగే ఈ వేడుకకి రాష్ట్రం నలు మూలల నుండి ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ తరలి రావచ్చు అని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే విజయవాడ, వైజాగ్ నుండి చాలా మంది ఈ కార్యక్రమం కోసం హైదరాబాద్ కి బయలు దేరారు. మరో వైపు ఈ కార్యక్రమంలో ఎలాంటి అపశృతులు జరగకుండా పోలీస్ డిపార్ట్ మెంట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఎన్.టి.ఆర్ – కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీను వైట్ల డైరెక్టర్. బ్యాంకాక్, యూరప్, హైదరాబాద్ లలో చిత్రీకరించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఎన్.టి.ఆర్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. బ్రహ్మానందం, ఎం.ఎస్ నారాయణ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో హీరో నవదీప్ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. కోనా వెంకట్ – గోపీ మోహన్ స్క్రిప్ట్ అందించిన ఈ సినిమాకి ఎస్. ఎస్ థమన్ సంగీతం అందించాడు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమా ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.