వెంకటేష్ ఒక నడిచే, మాట్లాడే ఫిలిం స్కూల్ అన్న తాప్సీ

వెంకటేష్ ఒక నడిచే, మాట్లాడే ఫిలిం స్కూల్ అన్న తాప్సీ

Published on Mar 16, 2013 3:21 PM IST

Tapsee
‘గుండెల్లో గోదారి’ సినిమాలో పల్లెటూరి పాత్రలో కనిపించిన తాప్సీ, త్వరలో మెహర్ రమేష్ తీస్తున్న ‘షాడో’ సినిమాలో తన ఒంపు సొంపులు ప్రదర్శించనుంది. ఈ సినిమా చిత్రీకరణ ఆఖరి దశలో వుంది. ఇటీవలే వెంకటేష్, తాప్సీ మధ్య ‘నాటీ గర్ల్’ పాటను చిత్రీకరించారు. ఇందులో తాప్సీ వేషధారణ ఇప్పుడు మీడియా అంతా చర్చనీయాంశం అయింది. ఇప్పటివరకూ తాప్సీ కనిపించిన అన్ని సినిమాలకంటే ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది.

తాప్సీ వెంకటేష్ తో కలిసి నటించడం ఇదే మొదటిసారి. విక్టరీ బాబుతో స్క్రీన్ పంచుకోవడంతో చాలా ఆనందంగా ఉంది. “అందరికీ తెలిసిన దానికంటే వెంకటేష్ సార్ బయట మరింత చలాకీగా ఉంటారు. అది కుడా వారికి బాగా తెలిసిన వారి దగ్గరే. నేను ఆయనని నడిచే, మాట్లాడే ఫిలిం స్కూల్ గా పరిగణిస్తానని” తాప్సీ ట్వీట్ చేసింది.

సినిమాలో తన పోర్షన్ ముగించుకుని త్వరలో ‘గుండెల్లో గోదారి’ సినిమా తమిళ్ వెర్షన్ ప్రమోషన్లో పాల్గోనుంది. దాని తరువాత ఆమె మొదటి హిందీ సినిమా ‘చష్మే బద్దుర్’ ప్రమోషన్లో పాలుగుంటుంది.

తాజా వార్తలు