త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఓ చిన్న విరామం తరువాత మార్చి 16 నుండి తిరిగి ప్రారంభం కానుంది. ఈ సినిమాకి ‘సరదా’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. పవన్ సరసన సమంత నటిస్తుండగా ప్రణిత సుభాష్ రెండో హీరొయిన్ గా ఎంపికయ్యింది. బోమన్ ఇరాని మరియు నదియా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాకి సంభందించిన ఒక ఆసక్తికరమైన కార్ చేజ్ ని ఇటివలే పొల్లాచిలో పవన్ మీద తెరకెక్కించారు. ఈ సినిమాలో పవన్ కారు డ్రైవర్ గా కనబడనున్నాడని సమాచారం. త్రివిక్రమ్ మార్కు డైలాగ్లతో అలరించనున్నాడు. పవన్ తన మార్కు స్టైల్ తో అలరించనున్నాడు. వీరిద్దరూ ఇదివరకు కలిసి తీసిన ‘జల్సా’ పెద్ద విజయం సాదించింది.
బి. వి. ఎస్. ఎన్ ప్రసాద్ నిరిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలో స్పెయిన్లో బార్సిలోనా అనే ప్రదేశంలో జరగనుంది.