చాలా కాలం గ్యాప్ తర్వాత ఎవర్గ్రీన్ బ్యూటీ శ్రీ దేవి నటించిన ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమా 2012లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమాని మాండరిన్ భాషలోకి డబ్ చేస్తున్నారు. ఈ డబ్ వెర్షన్ ని చైనా, మచౌ, హాంగ్ కాంగ్ లలో మార్చి 14న రిలీజ్ చెయ్యనున్నారు. ప్రస్తుతం చైనా హాలీవుడ్ ఫిల్మ్స్ మార్కెట్ విషయంలో చాలా ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతోంది. అలాగే అక్కడ ఇండియన్ సినిమాలు చాలా తక్కువగానే ఆడుతాయి. ముఖ్యంగా అక్కడ ఎక్కువ ఫారిన్ సినిమాలను, నాన్ – చైనీస్ సినిమాలను రిలీజ్ చెయ్యకుండా చైనాలో అడ్డుకుంటారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే 2012లో ఇండియన్ బెస్ట్ ఫిల్మ్స్ లో ఒకటైన ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమా అక్కడ విడుదల కావడం అంటే ఎంతో గర్వించదగ్గ విషయం.
గౌరీ షిండే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీ దేవి భర్తగా ఆదిల్ హుస్సేన్ నటించారు. అలాగే ప్రియా ఆనంద్ ఒక కీలక పాత్ర పోషించింది.
ఇంగ్లీష్ రాని ఓ ఇల్లాలు ఇంగ్లీష్ నేర్చుకొని తన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎలా మెప్పుపొందింది అనేదే ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ కథ.