సూపర్ హిట్స్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘బాహుబలి’ కోసం టాలీవుడ్ యంగ్ హంక్ రానా దగ్గుబాటి ట్రైనింగ్ పనులు మొదలు పెట్టనున్నాడు. ఈ పీరియడ్ అడ్వెంచర్ యాక్షన్ చిత్రం కోసం సిద్దమవుతున్న రానా కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ, బాడీ బిల్డింగ్ లాంటి పలు కష్ట తరమైన వాటిపై ట్రైనింగ్ తీసుకోనున్నాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రానా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఇద్దరూ భారీ ఫిజిక్ తో కనిపించనున్నారు.
ప్రస్తుతం రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందించనున్నారు. ఈ సినిమాని ఆర్కా మీడియా బ్యానర్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2014 సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంచనా వేస్తున్నారు.