ఖరారైన షాడో ఆడియో రిలీజ్ డేట్

ఖరారైన షాడో ఆడియో రిలీజ్ డేట్

Published on Mar 7, 2013 11:00 AM IST

Shadow

ఎప్పటికప్పుడు కొత్తదనంతో ఆకట్టుకునే విక్టరీ వెంకటేష్ సరికొత్త స్టైలిష్ అవతారంలో తెరకెక్కుతున్న సినిమా ‘షాడో’. అనుకున్న దాని ప్రకారం ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం మార్చి 7న జరగాలి కానీ కొన్ని అనివార్య కారణాల వాళ్ళ వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా ఆడియో వేడుకని మార్చి 15న జరపనున్నామని ఈ చిత్ర డైరెక్టర్ మెహర్ రమేష్ తెలిపారు.

వెంకటేష్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి పరుచూరి కిరీటి నిర్మాత. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలోని టైటిల్ ట్రాక్ ని ఈ రోజు సాయంత్రం రామానాయుడు స్టూడియోలో లాంచ్ చేయనున్నారు. తాప్సీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, మధురిమ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

తాజా వార్తలు